వరంగల్ వాయిస్, వరంగల్ : గత మూడు రోజులుగా ఉత్కంట రేపిన అరూరి రమేష్ పార్టీ మారుడం ఎట్టకేలకు తెరవీడింది. బీఆర్ఎస్ పార్టీకి , వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవకీ రాజీనామ చేస్తున్నట్లు లేఖ విడిదలజేసారు. అదే విధంగా ఇంతకాలం పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గార్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాల్లూ తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
