- ఇద్దరు అక్కడికక్కడే మృతి
వరంగల్ వాయిస్, కేసముద్రం : దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న కారు శుక్రవారం రాత్రి ఆరున్నర గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కేసముద్రం బైపాస్ రోడ్డు వెంట ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కారులోనే చిక్కుకున్నారు. ఇందులో చిన్నారి పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టేకుల గూడెంనుంచి అన్నారం షరీఫ్‌కు కారులో ఐదుగురు బయలు దేరారు. తిరిగి వచ్చే క్రమంలో హహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు వీరితో కలిశారు. మొత్తం ఏడుగురితో అన్నారం షరీఫ్‌లో బయలు దేరిక కారు కేసముద్రం బైపాస్ రోడ్డులో ప్రమాదానికి గురయింది. అయితే కారులో భద్రుతోపాటు చిన్నారి, మరోకరు ఉండగా, అచాలితోపాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
