వరంగల్ వాయిస్, క్రైం: ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ లపై టాస్క్ ఫోర్స్ టీం బుధవారం దాడులు చేసింది. నిబంధనలు పాటించకుండా ఉదయాన్నే బార్లు తెరుస్తున్నారని మట్వాడ, హన్మకొండ, కేయూసీ, మిల్స్ కాలనీ, సుబేదారి, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఆరుగురు బార్ నిర్వాహకులు, ఒక కార్మికుడిని అరెస్ట్ చేసి మద్యాన్ని సీజ్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడులు చేసిన బార్ అండ్ రెస్టారెంట్లలో తిరుమల బార్, సప్తగిరి బార్, తులసి బార్, ఇంద్రకీలాద్రి బార్, బాలాజీ బార్ లు ఉన్నాయి.
