వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో ఇటీవల మరణించిన పలు బాధిత కుటుంబాలను గురువారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. ప్రకాశరెడ్డిపేటలో గాదె పాపిరెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోస్టల్ కాలనీలో సూరవు దయాకర్ రావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరికొండ మధుసూదనాచారి వెంట 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, కార్యకర్తలు ఉన్నారు.
