- శ్రీ వివేకానంద సేవ సంస్థ ఆర్థిక సాయం
వరంగల్ వాయిస్, మొగిలిచెర్ల : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలోని శ్రీ వివేకానంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గత పది రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందిన చిలువేరు కమలాకర్ (35) కుటుంబాన్ని పరామర్శించారు. మృతిచెందిన కమలాకర్ కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయిలకు దాతల సహకారంతో ఆర్థిక సహకారాన్ని శ్రీ వివేకానంద సేవ సంస్థ అధ్యక్షుడు ఆడెపు రమేష్, ఉపాధ్యక్షుడు బిల్లా రమేష్, కోశాధికారి లెంకలపల్లి స్వామి, కునమల్ల రవి, కామకోని రఘుపతి, మాజీ సర్పంచి గణిపాక శ్రీనివాస్, గనిపాక స్వామి, సభ్యులు పాల్గొని రూ.13,016లతో పాటు 50 కేజీల బియ్యం అందజేశారు.
