వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ ఐఏఎస్ సహకారంతో గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో దొంతూరి సమ్మయ్య గౌడ్, ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో బాల్నే రాజు గౌడ్ ఇటీవల గీత వృత్తి చేసుకుంటూ ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి పడి నడుము విరగగా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15000 చెక్కులను బుర్రా వెంకటేష్ గౌడ్ పంపించారు. హనుమకొండ జిల్లా బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ కందాల శంకరయ్య గౌడ్ తో కలిసి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొనగాని యాదగిరి గౌడ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నారగోని కుమారస్వామి గౌడ్, గ్రేటర్ వరంగల్ గోపా అధ్యక్షుడు పులి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జనగాం వెంకటేశ్వర్లు గౌడ్, ఐనవోలు మండల అధ్యక్షులు పట్టాపురం ఎల్లా గౌడ్, బత్తిని నాగరాజు గౌడ్, గడ్డం రమేష్ గౌడ్ లు అందించారు. అనంతరం బొనగాని యాదగిరి గౌడ్ గీత వృత్తి చేసుకుంటూ పొరపాటున తాడి చెట్టుపై నుంచి మృతి చెందిన వారికి దాన సంస్మరణ ఖర్చుల నిమిత్తం రూ.25000, అంగ వైఖల్యం పొందిన వారికి రూ.15000 అందిస్తున్న బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గౌ శ్రీ బుర్రా వెంకటేశం గౌడ్ కు, తాడి టాపర్స్ కార్పొరేషన్ లోన్స్ సెక్షన్ ఆఫీసర్ పాముకుంట్ల రవీందర్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
