వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జీడబ్ల్యూఎంసీ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, గుండు చందన పూర్ణచందర్, ఈదురు అరుణ విక్టర్, జన్ను షిబారాణి, బస్వరాజు శిరీష, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, విజయశ్రీ రాజాఅలీ, పోశాల పద్మ, తూర్పాటి సులోచన, ఆడెపు స్వప్న, బైరాబోయిన ఉమా దామోదర్, బల్దియా సెక్రెటరీ విజయలక్ష్మి, ఉప కమిషనర్ మహిళ ఉద్యోగులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని తంగేడు పూలు, గునుగు పూలు, బంతిపూలు, చామంతులతో అందంగా పేర్చి మహిళలందరితో ఒక చోట చేరి చప్పట్లతో నృత్యాలు చేస్తూ సందడి చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా వరంగల్ మహా నగర ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, పండుగలకు పెద్దపీట వేయడం ముదావహమని అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరినీ ఏకం చేసిన పండగ బతుకమ్మ అని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పూలను పూజించి దేవతలుగా చూసుకొని గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలకు వచ్చిన ఆడపడుచులకు బతుకమ్మ,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమం విజయవతం చేసిన కార్పొరేటర్లు, ఉద్యోగులందరికి అభినందనలు తెలియ చేశారు.