Warangalvoice

Kishan Reddy got angry over Bandi Sanjay's arrest

బండి సంజయ్‌ అరెస్ట్‌పై మండిపడ్డ కిషన్‌ రెడ్డి

  • ఏ అభియోగం కింద అరెస్ట్‌ చేశారని డిజిపికి ప్రశ్న
    వరంగల్ వాయిస్,హైదరాబాద్‌:బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్‌, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌ లో అర్థరాత్రి నుంచి ఉన్న బండి సంజయ్‌ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. బండి సంజయ్‌ కుట్ర చేశారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్‌ పై ఏయే సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారనే వివరాలను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడిరచలేదు. దీనిపై గందరగోళం నెలకొంది. బండి సంజయ్‌ పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ కు ఫోన్‌ చేసి.. మాట్లాడారు. డీజీపీ సైతం ఫోన్‌లో వివరాలు వెల్లడిరచలేదు. అన్ని వివరాలు తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత.. బండి సంజయ్‌ ను ఏప్రిల్‌ 5వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో..బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌ నుంచి.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వరంగల్‌ కు తరలిస్తున్నారు.
Kishan Reddy got angry over Bandi Sanjay's arrest
Kishan Reddy got angry over Bandi Sanjay’s arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *