Warangalvoice

Change notices to Bandi Sanjay

బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు

  • లీగల్‌గా చర్చిస్తామన్న బండి సంజయ్‌
    వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: బండి సంజయ్‌కు మరోసారి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంటికి శనివారం ఉదయం సిట్‌ అధికారులు చేరుకున్నారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్‌ నోటీసులపై స్పందించిన బండి సంజయ్‌.. విచారణకు హాజరుకావాలా.. లేదా అనే అంశంపై తమ లీగల్‌ టీంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్‌ కు కట్టుబడి ఉన్నానని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో నమ్మలేని నిజాలున్నాయన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మూడు రోజుల క్రితం కూడా సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న తమ ఎదుట హాజరై వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. బండి సంజయ్‌ తన నివాసంలో లేకపోవడంతో అక్కడే నోటీసులను అధికారులు అతికించారు. గ్రూప్‌`1లో బీఆర్‌ఎస్‌ నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారని రెండ్రోజుల క్రితం బండి సంజయ్‌ ఆరోపించారు. ఒకే మండలం నుంచి 50 మందికి పైగా క్వాలిఫై అయ్యారని, ఒక చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారని, దీనికి మంత్రి కేటీఆరే బాధ్యుడని బండి సంజయ్‌ ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ నియమించిన సిట్‌ విచారణ ఎలా చేయగలదని ఆయన ప్రశ్నించారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్‌ తరహాలోనే పేపర్‌ లీకేజీ కేసును సిట్‌కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాల్సిందేనని, త్వరలో కేటీఆర్‌ నిర్వాకాన్ని ప్రజల ముందు పెడతామని బండి సంజయ్‌ తెలిపారు. అయితే అప్పుడు సిట్‌ విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది.

    Change notices to Bandi Sanjay
    Change notices to Bandi Sanjay

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *