వరంగల్ వాయిస్, కేయూ : ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రముఖ ఫార్మసీ సంస్థ అలయన్స్ అండ్ ఎకో సిస్టం మేనేజ్ మెంట్ సంచాలకుడు డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు అన్నారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో సెమినార్ హాల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో నేడు “డ్రగ్ డెవలప్ మెంట్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ : పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్” అనే అంశంపై విస్తృత ఉపన్యాసం చేశారు. ఫార్మసీ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. మారుతున్న జీవన్ శైలికి అనుగుణంగా డ్రగ్ డెవలప్ మెంట్ లో మార్పులు వస్తున్నాయన్నారు. దీనికి అనుగుణంగా రోగ నిర్ధారణ ఉండాలన్నారు, ఫార్మసీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్ధి అయినందుకు గర్విస్తున్నానని తెలిపారు. అనంతరం ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె సమ్మయ్య, డీన్ ఆచార్య వై నరసింహ రెడ్డి, పాఠ్య ప్రణాళిక అధ్యక్షురాలు డాక్టర్ స్వరూపారాణి, డాక్టర్ కృష్ణ వేణి బోధనా బోధనేతర సిబ్బంది డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజును ఘనంగా సన్మానించారు.
