వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని ప్రీతి నాయక్ ది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. అయితే ఆమె ఆత్మహత్యకు సైఫ్ ప్రధాన కారణమన్నారు. ప్రీతి పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలిపారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో ఇంజెక్షన్ దొరికిందని, కానీ నీడిల్ దొరకలేదన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీ షీటును దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కేఎంసీలో ప్రీతి ఆత్మహత్య ఘటన సంచలనం కలిగించింది. ఇదిలా ఉంటే ప్రతీ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ కు కోర్టును నిన్ననే బెయిల్ మంజూరు చేసింది.
