- ఐదు కోట్లు వెచ్చించినా అవసరాలు తీర్చని ప్లాంట్
- ఓ ఏజెన్సీతో కుమ్మకై రూ. 70 లక్షలకు అప్పనంగా కట్ట పెట్టిన అధికారులు.!
- మామూళ్ల మత్తులో ఆక్సిజన్ ప్లాంట్ మూసివేసేందుకు కుట్ర
- కోవిడ్ సమయంలో దాతలు అందజేసిన ఆక్సిజన్ మిషన్స్ సైతం గోల్ మాల్
- జాడలేని విజిలెన్స్ విచారణ, పట్టించుకుకొని ప్రభుత్వ పెద్దలు
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : కోవిడ్ క్లిష్ట పరిస్థితిలో ఎంతో ఉన్నత లక్ష్యాలతో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ రోగుల అవసరాలకు అక్కరకు రాకుండ పోతోంది. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కల్పతరువులా ఊపిరి పోస్తుంది అనుకుంటే అధికారుల కనికరం లేక మరమ్మతులకు నోచుకోక ఏకరువు పెడుతుంది అధికారుల పర్యవేక్షణ లోపమో లేక ఓ ప్రయివేట్ ఏజెన్సీ పాలిట వరమో తెలియదు గానీ, చిన్న చిన్న మరమ్మత్తులు చేయించడం చేతకాక ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు పేరుతొ భారీ కుంభకోణం జరుగుతున్నట్లు జిల్లా కేంద్రంలో భారీగా చర్చ నడుస్తుంది. భారీ అంచనాలతో ఎంతో మంది రోగులకు ఉపయోగ పడుతుందని ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను అధికారులు పట్టించుకోకుండా ఉండడటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొవిడ్ క్లిష్ట పరిస్థితిలో ఎన్నారై దాతలు అందించిన ఆక్సిజన్ కిట్లు, బెడ్స్ హాస్పిటల్లో కనబడడం లేదని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. కలెక్టర్ దీనిపై స్పందించి ఆక్సిజన్ ప్లాంట్ మరమత్తులు చేయించాలని, అలాగే ఈ కుంభకోణంలో ఉన్న ప్రైవేటు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.