వరంగల్ వాయిస్,హైదరాబాద్: తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నాయకులు చెలగాటమాడుతున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు.. తదనంతర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం. కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం’’ అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
