- ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల శరత్
వరంగల్ వాయిస్, వరంగల్ : జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, అనుమతి లేని కళాశాలల జాబితా విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఇంటర్ విద్యాశాఖ అధికారి డీఐఈఓ మాధవ్ రావుకు ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్ వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టి, ప్రైవేట్, కార్పోరేట్ కళాశాలల్లో వసూలు చేస్తున్నఅధిక ఫీజులను నియంత్రించి, ప్రభుత్వ అనుమతి లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేసి, ఇంటర్ నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అభిరామ్, శివ, రాకేష్ పాల్గొన్నారు.
