మంత్రులు జగదీశ్ రెడ్డి, గంగుల డిమాండ్ వరంగల్ వాయిస్,హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ అన్నారు. పశ్నాపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ సంజయ్‌ని ఆ పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి విూడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌లోకి చోచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు.పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్రాజకీయ క్రీడకు తెరలేపిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఆ పార్టీ ట్రాప్‌లో పడొద్దని మంత్రి కోరారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీజేపీని గ్రామాల్లో ప్రజలు నిలదీయాలి పిలుపు నిచ్చారు. యువత, విద్యార్థులను బీఆర్‌ఎస్ నుంచి దూరంచేసే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. బీజేపీ కుటిల రాజకీయాలకు లీకేజీ నిదర్శనం.. కేవలం బీజేపీ గ్రూపులకే పరీక్ష పేపర్లు వెళ్లాయి.. దీనిని బూచిగా చూపించి ఎన్నికల్లో లబ్దికి ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. వేల మంది తల్లిదండ్రులు, విద్యార్థుల ఉసురు సంజయ్‌కు తగులుతుంది.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర చేశారు. లీకేజీ బీజేపీ కుట్రలో భాగమే.. తెలంగాణలో బిహార్ తరహా గుండాయిజం.. రౌడీయిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణను బిహార్ తరహాగా మారుస్తారేమోనని భయం వేస్తోంది.. అన్నింటికీ కరీంనగరే వేదిక అవుతోంది.. అంటూ గంగుల మండిపడ్డారు. యువతను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ లీకేజీలకు పాల్పడుతోంది.. నిరుద్యోగులకు ఉపాధి రాకుండా బీజేపీ జెండా పట్టుకు తిరగాలనే కుట్ర చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ హిందూ, ముస్లింలకు గొడవలు పెట్టేది.. ఇప్పుడు బీజేపీ నీచితినీచంగా ప్రవర్తిస్తుంది.. ఉత్తర భారత సంస్కృతిని తెలంగాణలోకి తీసుకొస్తున్నారంటూ గంగుల కమలాకర్ మండిపడ్డారు.