సెప్టెంబర్ 9న ఆయన జయంతి
నేడు తెలంగాణ భాషాదినోత్సవం
(ఆయన జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించింది.)
అది 1931 తెల్లదొరల పాలన నుంచి భరతమాత విముక్తి కోసం పోరాటం చేస్తున్న ఎందరో వీరులు, ఆ వీరులలో భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ పారాటం మరువలేనిది. భగత్ సింగ్ పోరాటం రుచించని బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను ఉరితీసింది. అప్పడు విద్యర్ధి దశలో ఉన్న కాళోజి ఈ అన్యాయాన్ని తట్టుకోలేపోయాలు. అప్పడే ఆయనలో దేశభక్తి చిగురించింది. భగత్ సింగ్‌ను ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ రాసిన కవిత్వమది. అప్పటి నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా అతని కలం స్పందించింది.
కాళోజీ తన పాఠశాల విద్యార్థి ధ నుంచి కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. ఆయన కవిత్వం 1931లోనే ప్రచురించబడింది.
కత్తికంటే కలం గొప్పదని భావించాడు. కవితనే ఆయుధంగా సంధించాడు. విద్యార్థి దశలో నాటి దేశ కాల పరిస్థితులు, రాజకీయాలు కాళోజీని ఎంతగానో ప్రభావితం చేసాయి. ఆంగ్లేయుల వలస పాలన నుంచి విముక్తి పొందాలనీ యావత్ భారత ప్రజలు పోరాడారు. స్వతంత్ర పోరాట జ్వాలలు మిన్నంటుతున్నాయి. సహజంగానే చైతన్యవంతుడైన కాళోజీ సత్యగ్రహోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించాడు. అటు ఆంగ్లేయుల వలస పాలనకు, ఇటు ఇక్కడి హైదరాబాద్ స్టేట్‌లోని నిజాం రాజు నిరంకుశ పాశవిక విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో స్వతంత్ర సమరాన్ని రగిలించి కాళోజీ ఇలాంటి ఉద్యమ సంస్థలతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. ఆనాటి జాతీయోద్యమ నాయకులు స్వామి రామానంద తీర్థ మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి వారితో కలిసి అనేక ఉద్యమాల్లో కాళోజీ పాల్గొన్నాడు, విద్యార్థి దశలో పి.వి. నరసింహారావు కాళోజీ అనుయాయులే విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేదాజ్ఞలను లెక్కచేయకుండా వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో స్థాపించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. కాళోజీ తన కవి తలన్నింటికీ ‘‘నాగొడవ’’ అని ఒకే పేరు పెట్టడం విశేషం 1953లో అలంపురంలో కాళోజీ మొదటి కవిత సంకలనం నా గొడవను ఆవిష్కరించిన శ్రీ శ్రీ ఆయనను నిఖిలాంధ్ర కవిగా ప్రశంసించాడు. తెలియక ప్రేమ తెలిసి ద్వేషము, ఎన్నక కథ, రెండు గింజలు వంటి కథలు సామాజిక రాజకీయ చైతన్యం కలిగించేవే. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్న రుషి కాళోజీ నా భారతదేశ చరిత్ర జీవనగీత వంటి అనువాదాలు చేశారు. కాళోజీ భాషావాదం ఎవని వాడుక భాష వాడు రాయాలె ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని మనమనుకొనుడు, మనలను మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నోసార్లు చెప్పిన, భాష రెండు తీర్లు, ఒకటి బడి పలుకుల భాష రెండోది పలుకుబడుల భాష, పలుకు బడుల భాషగావాలె అంటూ తన కవితల్ని హోరెత్తించాడు. రజాకార్త దౌర్జన్యాన్ని ప్రతిఘతిస్తూ1945లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవి.
వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయతినంచినందుకు ఆయనను ఆనాటి నిజాం ప్రభుత్వం నగర బహిష్కరణ శిక్ష విధించింది. ఆనాడు ఉద్యమం ఊరూరా ఉధృతమైంది. ప్రజలు సాయుధులై నిజాం సైన్యాలను రజాకార్ల మూకలను ఎదుర్కొని చెండాడారు. 1939-43ల మధ్య రెండుసార్లు జైలుకు పోవాల్సి వచ్చింది. ఒకసారి వరంగల్ జైలులో కాపలా కాస్తున్న పోలీస ఉద్యమకారులను కల్చినా పాపం లేదన్నప్పుడు జైల్లో ఉన్న కాళోజీ ముందు కెళ్లి, దమ్ముంటే కాల్చు అని రొమ్ము విరిచి చూపించాడట. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురై విద్యను కోల్పోతున్న తరుణంలో వారిని నాగపూరు విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర మరువ లేనిది. అన్ని రంగాల్లో ఆధిపత్య వాదాన్ని అంతం చేసి స్వేచ్ఛను పంచేందుకు అనుక్షణం ఆయన తపించాడు. 1914 సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీ ప్రజా ఉద్యమాలే ఉద్యమ ఊపిరిగా అలుపెరుగని యోధుడిలా జీవిత యాత్రను సాగించారు కాళోజీ మానవతా వాది. మార్గదర్శకుడు 2002 నవంబర్ 13న కాళోజీ తుది శ్వాస విడిచాడు.
“కాళోజి నారాయణరావు అవార్డు”
మహబూబాబాద్ జిల్లాకు చెందిన కవి గాయకుడు జయరాజ్ చిన్న నాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కలిగా పేరు తెచ్చుకున్నారు పేద దళిత కుటుంబానికి చెందిన ఆయన వివక్ష లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సూచించారు బుద్ధుడి బోధనలకు ప్రభావితులు క్రమమై ఉద్యమకాలములో పల్లె పల్లెనా తిరుగుతూ ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించేందుకు జయరాజ్ కృషి చేశారు ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రాశారు ఆయన రాసిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కాలోజీ నారాయణరావు అవార్డు 2023 సంవత్సరానికి గాను జయరాజుకు దక్కింది సాహిత్య సాంస్కృతిక రంగాలలో చేసిన కృషిని గుర్తించి అందించే కాలేజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సిఫారస్ మేరకు సీఎం కేసీఆర్ జయరాజును ఎంపిక చేశారు ఈనెల తొమ్మిదిన కాళోజి జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమం లో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు ఈ అవార్డు ద్వారా 1.01. 116 నగదు జ్ఞాపకను అందించి దృశ్యాలతో సత్కరించు సత్కరించనున్నారు.

కొలనుపాక కుమారస్వామి, వరంగల్.
సెల్: 9963720669