Warangalvoice

Ready to go to jail for the people

ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే

  • ఆదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా
  • ఆదానీ షెల్‌ కంపెనీలకు కోటాది రూపాయులు ఎలా వచ్చాయి
  • చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి
  • లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు
  • అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకురాహుల్‌
    వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ షెల్‌ కంపెనీలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అలాగే ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడనని అన్నారు. అదానీ వ్యవహారాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్‌ గాంధీ చెప్పారు. అనర్హత వేటు వేసినా..జైల్లో వేసినా..కొట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అదానీ ఇష్యూను డైవర్ట్‌ చేయడానికే తనపై అనర్హత వేటు వేశారని చెప్పారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకు వచ్చిన ఆయన..అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలన్నారు. అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన షెల్‌ కంపెనీలు డిఫెన్స్‌ సెక్టార్‌తో ముడిపడి ఉన్నాయి. ఒక చైనా జాతీయుడికి కూడా ఈ పెట్టుబడులతో లింక్‌ ఉంది. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో చెప్పాలని అడిగాను. ప్రజల్లోనే ఉంటాను.. భారత్‌ జోడో యాత్రలో ప్రజల్లోకి వెళ్లాను. నేను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తివే అయితే నాకు మాట్లాడే అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నావు? భారత ప్రజల ప్రజాస్వామిక గొంతు వినిపించేందుకు, కాపాడేందుకు నేనిక్కడ ఉన్నాను. నేను దేనికీ భయపడనని రాహుల్‌ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఇదివరకటిలా విూడియా సంస్థల నుంచి లభించిన మద్ధతు ఇప్పుడు లేదు. ఇది ఓబీసీల వ్యవహారం కాదు. ఇది మోదీ`అదానీల సంబంధానికి సంబంధించిన వ్యవహారం. దాన్నుంచి దృష్టి మళ్లించడం కోసం విదేశాల్లో నా వ్యాఖ్యల గురించి మాట్లాడతారని, అనర్హత అంశాన్ని తీసుకొస్తారని మండిపడ్డారు. ఇప్పుడు ఓబీసీ అంటున్నారు. నేను నిజం మాట్లాడతాను. మాట్లాడుతూనే ఉంటాను. నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా నాకు పెద్ద తేడా ఏవిూ లేదని రాహుల్‌ స్పష్టం చేశారు.. అనర్హతలు లాంటివి నన్ను ఏమి చేయలేవు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నా పోరాటాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. మోదీని ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇది ఓబీసీ వ్యవహారం కాదు… మోదీ, ఆదానీ మధ్య ఉన్న బంధం పై ప్రశ్నిస్తున్నాను. రూ. 20 వేల కోట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి ఆదానీ షెల్‌ కంపెనీల్లోకి వచ్చాయో చెప్పాలి. ఈ దేశం నాకు ప్రేమ, ఆప్యాయత సహా అన్ని ఇచ్చిందని రాహుల్‌ చెప్పారు. అదానీ షెల్‌ కంపెనీల్లో రూ. 20 వేల కోట్లు పెట్టుబడులు ఎవరు పెట్టారని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. అదానీ షెల్‌ కంపెనీల్లో ఎవరుపెట్టుబడులు పెట్టారో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చైనీయులు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. మోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచే అదానీతో సంబంధాలున్నాయని వెల్లడిరచారు. నిబంధనలను ఉల్లంఘించి అదానీకి ఎయిర్‌ పోర్టుల నిర్మాణ బాధ్యతలను కట్టబెట్టారని ఆరోపించారు. లండన్‌ తన ప్రసంగంపై కేంద్ర మంత్రులు అబద్దాలు ప్రచారం చేశారని రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ లోనూ అబద్దాలు మాట్లాడారని చెప్పారు. మంత్రుల ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ ను కోరితే..స్పీకర్‌ నవ్వి మాట్లాడే అవకాశం రాదని తనతో చెప్పినట్లు వెల్లడిరచారు. అదానీ వ్యవహారంలో పార్లమెంట్‌ కు సాక్ష్యాలు సమర్పించానన్నారు. లోక్‌సభలో కావాలనే తన ప్రసంగాన్ని తొలగించారని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నా యని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. తనపై వేటే అందుకు నిదర్శనమని చెప్పారు. తాను దేనికి భయపడనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించడం మాత్రం మానేది లేదని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమనేనన్నారు. ప్రధాని మోడీ దృష్టిలో దేశమంటే అదానీ..అదానీ అంటే దేశం అని రాహుల్‌ గాంధీ విమర్శించారు. దేశం తనకు ప్రేమ, గౌరవం ఇచ్చిందని అన్నారు. తనకు అండగా నిలిచిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. మోడీకి భయం పట్టుకుందని..ఆయనే విపక్షాలకు ఆయుధం ఇచ్చారని చెప్పారు.

    Ready to go to jail for the people
    Ready to go to jail for the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *