5 నుంచి 9 వరకు జాతర: జగదీశ్ రెడ్డి వరంగల్ వాయిస్, సూర్యాపేట: సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరకు ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. సూర్యాపేటలోని గొల్ల బజార్ ఎల్లమ్మ గుడిలో పెద్దగట్టు జాతరలో తొలి ఘట్టమైన మకర తోరణం తరలిపు పక్రియను ప్రత్యేక పూజలు చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి భేరీలు వాయించారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం కల్పించామన్నారు. ఆదివారం రాత్రి కేసారం నుంచి దేవర పెట్టే తరలింపు పక్రియ ఉంటుందని చెప్పారు. సోమవారం నుంచి జాతరకు భక్తులు వస్తారని వెల్లడిరచారు. మూడు రోజులపాటు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్టాల్ర నుంచి కూడా 15 లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమై.. 9వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ ` విజయవాడ హైవే పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు.. టేకుమట్ల నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు విూదుగా వెళ్లాలని సూచించారు. ఈ వాహనాలన్నీ నామాపురం వద్ద జాతీయ రహదారి 65పై కలుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనదారులను రోళ్లబావి తండా వద్ద మళ్లించనున్నారు. రయాన్‌గూడెం వద్ద హైవేపై కలుస్తాయి. హెవీ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ను కోదాడ వద్ద మళ్లించి, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్‌పల్లి విూదుగా హైదరాబాద్‌కు పంపించనున్నారు. మొత్తంగా లింగమంతుల స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెద్దగట్టు జాతరకు రూ. 6.5 కోట్లు కేటాయించారు. మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు,చేజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కల్పించారు. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు, అధికారులు అంచనా వేస్తున్నారు.