- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మోహన్ సింగ్
- ఎంజీఎం(పీపీయూనిట్) పరిశీలన
వరంగల్ వాయిస్, వరంగల్ : ఎంజీఎం హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీపీ యూనిట్)ను వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్.మోహన్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్.మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని డాక్టర్ కు, స్టాఫ్ ను కోరారు. ముఖ్యంగా ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ 100శాతం టార్గెట్ రీచ్ కావాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరాల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉందని సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పిల్లలు, వృద్ధులు ఈ సమయంలో బయట తిరుగడం మంచిది కాదని తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వస్తే స్వెటర్ కానీ, ఉలన్ దుస్తులు ధరించి బయటికి వెళ్లాలని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ నర్మద, ఏఎన్ఎం సులోచన, రామ రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.