Warangalvoice

Center's cover-up on Polavaram

పోలవరంపై కేంద్రం కప్పదాటు వ్యవహారం

  • గట్టిగా నిలదీయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలం
  • విభజన జరిగి 9 ఏళ్లు కావస్తున్న కదలని ప్రాజెక్ట్‌
  • నిర్వాసితుల విషయంలో కేంద్ర, రాష్టాల్ర దోబూచులాట
    వరంగల్ వాయిస్,అమరావతి:పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడడంలో వైసిపి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పోలవరంపై చంద్రబాబుపై విమర్శలకే మంత్రులు, సిఎం జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాకాకుండా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. దీంతో విభజన జరిగి 9 ఏళ్లు కావస్తున్నా పోలవరం పూర్తి కాలేదు. నిర్వాసితులకు పరిహారం దక్కలేదు. నిధులు సాధించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లుంటోంది. కేంద్రం వద్దకెళ్లి నిధులను డుగుతున్నాం అని చెపుతున్నా..ప్రగతి మాత్రం కనిపించడం లేదు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చేసిన పనులకు రూ.2,600 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడిరచగా, కేంద్రం ఇచ్చింది 828 కోట్లు మాత్రమే. కొత్త డిపిఆర్‌ ఆమోదానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు అత్యవసరంగా రూ.15 వేల కోట్లివ్వండని అడగ్గా, కొత్త డిపిఆర్‌ను బుట్టదాఖలు చేశామని కేంద్రం లేఖ పంపింది. అలాగే 2005 అనంతరం 18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదంది. కేంద్రం రాష్టాన్రికి ఈ విధంగా అన్యాయం చేస్తున్నా గట్టిగా ఒత్తిడి చేయడం లేదు. ఇది జాతీయ ప్రాజెక్టు కనుక పూర్తి చేయాల్సిన బాద్యత కేంద్రానిదే. నిర్వాసితుల పునరావాసంపై తొలిదశ, మలిదశ, అని వక్ర భాష్యాలు చెపుతున్న కేంద్రానికి రాష్ట్ర సర్కారు తీరు దారుణంఆకాక మరోటి కాదు. 2017`18 ధరలకనుగుణంగా రాష్ట్రం రూ.55 వేల కోట్లకు కొత్త డిపిఆర్‌ పంపగా సాంకేతిక సలహా మండలి ఆమోదిం చింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ రూ.47 వేల కోట్లకు కుదించింది. నిర్వాసితుల పునరావాసానికే రూ.30 వేల కోట్లు కావాలి. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాకే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న అంతర్జాతీయ నిబంధన లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించి ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఎపికి జీవనాడిగా అభివర్ణించే పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర బిజెపి ప్రభుత్వం పూటకోమాట చెబుతూ గందరగోళం సృష్టిస్తోందని సిపిఐ నాయకుడు రామకృష్ణ ఘాటుగగా విమర్శించారు. నిర్మాణ పనులు, నిర్వాసితుల సహాయ, పునరావాసం అడుగు ముందుకు పడని దయనీయ స్థితి ఉండగా, కేంద్రం చేస్తున్న గజిబిజితో ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. గడచిన వారం రోజుల్లో పార్లమెంట్‌లో కేంద్ర మంత్రుల ప్రకటనలు దోబూచులాడగా, నిధుల విషయమై తాజాగా ఆర్థికమంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారుకు పంపిన లేఖ మరింత అయోమయంలో పడేసిందని రామకషృణ అన్నారు. పూర్తి చేసిన పనులకుగాను రూ.828 కోట్లు విడుదల చేస్తూ, ఇంకా ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లేనని బాంబు పేల్చింది. 2013`14 ధరల ప్రకారం రూ.20 వేల కోట్ల అంచనాకే కట్టుబడి ఉన్నట్లు మరోమారు స్పష్టం చేసింది. సవరించిన సవివర ప్రాజెక్టు రిపోర్టు మేరకు ఇంకా కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా ఆ ప్రస్తావన చేయలేదు. లోక్‌సభలో మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ జోషి సమాధానమిస్తూ తొలి దశలో ప్రాజెక్టు ఎత్తు 41.15 విూటర్లేనన్నారు. రాజ్యసభలో మరో మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబు చెబుతూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ఎత్తు 45.72 విూటర్లుగా చెప్పుకొచ్చారు. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా సంతరించుకున్న ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దాని బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుందని రామకృష్ణ మండిపడ్డారు. పోలవరాన్ని ఆది నుంచీ కేంద్రం వివాదాస్పదం చేస్తోంది. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌నే భరిస్తాం నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని చెప్పడం దారుణమని సిపిఐ నేత అన్నారు. ప్రతిపాదిత ఎత్తులో ప్రాజెక్టును నిర్మిస్తే 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. అత్యధికులు గిరిజనులే. అంచనాలను దాటి ఎక్కువ ప్రాంతాలు కొద్దిపాటి వరదలకే మునిగాయి. పునరావాస కాలనీలు సైతం మునిగాయి. కాంటూరు లెక్కలు తప్పుల తడకలని తేలిపోయింది. ప్రభుత్వ గణాంకాల బట్టి చూసినా ఇప్పటికి 22 శాతానికే పునరావాసం పూర్తయింది. ప్రాజెక్ట్‌ కోసం తమ సర్వస్వం ధారపోసిన లక్షలాది మంది నిర్వాసితుల పునరావాసుల సంక్షేమాన్ని గాలికొదిలేయడం దారుణమని రామకృష్ణ అన్నారు.
Center's cover-up on Polavaram
Center’s cover-up on Polavaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *