- కెటిఆర్ కుసన్నల్లోనే వ్యవహారం
- బిజెఇఐఎం కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు
- మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
వరంగల్ వాయిస్,హైదరాబాద్: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ఉండటం వేస్టని, వెంటనే కేటీఆర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినవాళ్లంతా బీఆర్‌ఎస్ కార్యకర్తలేనని, వాళ్లందరూ ఎదో ఒక పదవితో సంబంధం ఉన్నవాళ్లేనని తెలిపారు. ఈ ఘటనలో కారణం అయిన నిందితులను బీఆర్‌ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అరెస్టయిన కార్యకర్తలను పరామర్శించడానికి గురువారం చంచల్ గూడ సెంట్రల్ జైల్ కు వెళ్లిన బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. తప్పు చేసినవాళ్లను వదిలిపెట్టి న్యాయం కోసం పోరాడుతున్నవాళ్లను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. దాదాపు ఏడుగురు బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేటీఆర్ మంత్రిగా ఇంచార్జ్ తీసుకున్నవన్నీ ఫెయిల్ అయ్యాయని మండిపడ్దారు. ధరణి స్కాం, పోయిన ఏడాది జరిగిన ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్, ఇప్పుడు జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కూడా కేటీఆర్ ఐటీ శాఖ కనుసన్నంల్లోనే జరిగాయని మండిపడ్డారు. ఇవన్నీ జరుగుతున్నా కేటీఆర్ పై సీఎం కేసీఆర్ స్పందించక పోవడం హాస్యాస్పదం అని బండి అన్నారు. పనులు చేయరానివాడు మంత్రిగా
రాష్ట్రంలో సీఎం, కేటీఆర్, కవితకు ఒక రూల్, మిగిలిన వాళ్లందరికీ ఒక రూల్ నడుస్తుందని విమర్శించారు. వీటన్నింటినీ వదిలిపెట్టి న్యాయం కోసం ఆందోళన చేసినవాళ్లను నాన్ బెయిలబుల్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే పేపర్ లీక్ కు కారణమైనవాళ్లను సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని తెలిపారు.
