పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే శంకర్ నాయక్
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 47 మంది బాధితులకు మంజూరైన రూ.15,99,500 విలువ గల చెక్కులను అందించారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షణ పథకాలను రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు సాగుతున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన కేసీఆర్ కు ఎమ్మెలే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్, వివిధ మండల జడ్పీటీసీలు, ఎంపీపీలు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ హోదాలో ఉన్న చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టణ వార్డు కౌన్సిలర్లు, తెరాస ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.
24న కేటీఆర్ జన్మదినం ఘనంగా నిర్వహించాలని పిలుపు
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం ఈనెల 24న మహబూబాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, పట్టణంలోని అన్ని వార్డులలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కేటీఆర్ జన్మదినాన్ని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించాలని మహబూబాబాద్ శాసన సభ్యుడు బానోతు శంకర్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్ ఉన్నారు.
