వరంగల్ వాయిస్, తొర్రూరు : పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని, ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తొర్రూరు మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పి.రఘునారాయణ అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య హాజరై మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో సంఘం పనిచేస్తుందని, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందని తెలిపారు. పెన్షనర్స్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ప్రతి నెల 1న జీతాలు ఇవ్వాలని, మెడికల్ బిల్స్ ను వెంటనే మంజూరు చేసి, సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. 398 వేతనంపై పనిచేసిన టీచర్స్ కు నోషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి, లైఫ్ సర్టిఫికెట్స్ ఆన్ లైన్ తో పాటు మాన్యువల్ గా ఇచ్చేందుకు అనుమతించాలని, ఈహెచ్ఎస్ స్కీం కింద అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్సకు అనుమతించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెంకటచారి, కోశాధికారి నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు నారాయణ, శంకరయ్య, రాములు, మల్లయ్య పాల్గొన్నారు.
