- Pending Works: సద్భావన టౌన్‌షిప్ బీ బ్లాక్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. బోర్లు వేయాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో ఉన్న సద్భావన టౌన్‌షిప్ బీ బ్లాక్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. బీ బ్లాక్‌లో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. టౌన్‌షిప్‌లోని బీ బ్లాక్ లో తీవ్ర నీటి కొరత ఉన్నదని, ఈ నేపథ్యంలో బోర్లు వేయాలని కోరారు. గతంలోనూ ఈ అంశం గురించి ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి మార్పు జరగలేదని వినతిపత్రంలో తెలిపారు. వేసవి సీజన్ నేపథ్యంలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు తక్షణమే అదనపు బోర్లు వేయాలని బీ బ్లాక్ అసోసియేషన్ సభ్యులు ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
టౌన్‌షిప్‌కు చెందిన బ్లాకుల్లో సెక్యూర్టీ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. సీసీటీవీ నిఘా పరికరాలు, సెక్యూర్టీ డ్రెస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో హామీ ఇచ్చినట్లుగా సెక్యూర్టీ రూమ్‌లను తక్షణమే నిర్మించాలన్నారు. ఏ, సీ బ్లాక్ సభ్యుల కోసం ప్రత్యేక ఆఫీసు రూం ఏర్పాటు చేశారని, అదే తరహాలో బీ బ్లాక్ కోసం కూడా ఆఫీసు రూమ్‌ను కేటాయించాలని ఆ లేఖలో కోరారు. మ్యాక్స్ సొసైటీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్వోసీ ఇవ్వాలని టీజీఆర్ఎస్సీఎల్ డైరెక్టర్‌ను అభ్యర్థించారు. టీఎస్ఆర్ఎస్సీఎల్ డైరెక్టర్‌ను కలిసినవారిలో బీ బ్లాక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్, జనరల్ సెక్రటరీ పవన్ కుమార్, ఈసీ సభ్యుడు కాజా మియా ఉన్నారు.
