Warangalvoice

It has been four years since the Pulwama terror attack

పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు

  • నాలుగేళ్లయినా మానని గాయం

వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగగేళ్లు కావస్తోంది. అయినా పాకిస్థాన్‌ ఉగ్రవాదుల కార్ఖానాలను మూసేయడం లేదు. అంతర్జాతీయంగా అభాసు పాలవుతున్నా తన కుత్సితాలను ఆ దేవం వదులుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14న భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్‌లోని పుల్వామా వద్ద పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ నెత్తుటి మరకకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా అశ్రునివాళులు అర్పించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన పాక్‌ ఉగ్రమూకలకు భారత సైన్యం సర్జికల్‌ స్టైక్స్‌ రూపంలో గుణపాఠం చెప్పింది. అయితే మూడేళ్లు గడిచిన కూడా ఆ భయంకర సంఘటన అందరినీ కదిలించింది వేస్తోంది. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడేళ్ల క్రితం నాటి చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు. ’2019లో పుల్వామా దాడిలో అమరులైనవారందరికీ నా నివాళి. దేశానికి వారు అందించిన విశిష్ఠ సేవలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జవాన్ల ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తాయి’ అంటూ జవాన్లకు నివాళి అర్పించారు. పాకిస్తానీ టెర్రరిస్టు గ్రూప్‌ జైషే మహమూద్‌ కు చెందిన సూసైడ్‌ బాంబర్‌ కారులో ఐఈడీతో దూసుకొచ్చి సీఆర్పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న బస్సును ఢీకొట్టాడు. అవంతిపుర దగ్గర జమ్మూ శ్రీనగర్‌ నేషనల్‌ హైవేపై జరిగిన ఘటనలో 76వ బెటాలియన్‌ కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న బస్సును.. 300 కేజీల పేలుడు పదార్థాలతో నిండి ఉన్న కారుతో ఓ సూసైడ్‌ బాంబర్‌ ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ దురాగతానికి తామే బాధ్యులమని జైషే మహమూద్‌ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. సూసైడ్‌ బాంబర్‌ కు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్‌ చేసింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని అదిల్‌ అహ్మద్‌ దార్‌ గా గుర్తించారు. అదిల్‌ స్వస్థలం పుల్వామా జిల్లా గుండీబాగ్‌. ఎటాక్‌ కు ఏడాది క్రితమే అతను జైషేలో చేరాడు. ఎటాక్‌ జరిగిన స్థలానికి 10 కిలోవిూటర్ల దూరంలో ఇల్లు అదదెకు తీసుకున్నాడు. మారుతీ ఎకో వ్యాన్‌ ను రెంట్‌ కు తీసుకుని అదిల్‌ దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దాదాపు 15 రోజుల తర్వాత పాకిస్తాన్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్‌ స్టయ్రిక్స్‌ చేసింది. 2019 ఫిబ్రవరి 26న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ్గªటైర్‌ జెట్స్‌ పాకిస్తాన్‌ బాలాకోట్‌ లోని జైషే ట్రైనింగ్‌ క్యాంప్‌ పై బాంబుల వర్షం కురిపించాయి. పుల్వామా ఎటాక్‌ సూత్రధారి, జైషే మహమూద్‌ కశ్మీ ర్‌ చీఫ్‌ మహమూద్‌ ఖరి యాసిర్‌ ను అవంతిపురాలోని పరిట్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో భద్రతా బలగాలు హతమార్చాయి.

It has been four years since the Pulwama terror attack
It has been four years since the Pulwama terror attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *