వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మంద కృష్ణ మాదిగపిలుపు మేరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా 8వ రోజు రిలే నిరాహారదీక్షలో ఎంఎస్పీ మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొన్నారు. దీక్ష లో ఎంఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి పాషా, మండల ఇంఛార్జి కందిపాటి భిక్షపతి, వీహెచ్ పీఎస్ జిల్లా నాయకులు చలగొల వెంకన్న, మోలుగురి కుమార్, ఎంఎస్పీ మండల నాయకులు, మంద సంపత్, మట్టె మహేష్, బిర్రు మంజుల, బొడ సక్రియా, సాంబ లక్ష్మీ, భిక్ష నాయక్, మాలోతు అమ్మి, చెవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
