పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో..
వరంగల్ వాయిస్, పరకాల : శ్రీరామ నవమి సందర్భంగా పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ మహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, సుఖ సంతోషాలతో అందరూ జీవించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బసవేశ్వరాలయంలో..
శ్రీరామనవమి సందర్భంగా గీసుగొండలోని బసవేశ్వరాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మగడ్డ జాన్ విక్రమ్, అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్, బూత్ అధ్యక్షులు కత్తి వెంకటేశ్వర్లు, పాకనాటి శ్రీకాంత్, అనిల్, కందికొండ రాజు, కందికొండ ప్రదీప్, వాటికిల గోపి, కత్తి హేమలత, కర్ణ కంటి రజిత, రేవంత్, వాసు తదితరులు పాల్గొన్నారు.