Warangalvoice

c9f71e33 35db 4aab 83ad 7bc412afc9d9

పట్టుదలతో విజయతీరం చేరాలి

  • చీఫ్ విప్ వినయ్ భాస్కర్
  • యువజనోత్సవాలు-2023 ప్రారంభం

వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు-2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువజనోత్సవాల వేదిక ద్వారా యువత తమ ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. పట్టుదల,క్రమశిక్షణ,ఆకుంఠిత దీక్షతో యువలోకం విజయతీరాలను చేరుకోవాలన్నారు. అలాగని ఓడిపోతే ఓడిన చోటనే గెలుపు సూత్రాలను నేర్చుకుని విజయాన్ని ముద్దాడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్ కుమార్,ఇందిర, సారంగపాణి, కందుల సృజన్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

c9f71e33 35db 4aab 83ad 7bc412afc9d9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *