Warangalvoice

BRS candidate should win as MLC of graduates

పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

  • ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం

వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణలో ఉమ్మడి నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పట్టభద్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అనిల్ గుర్తుచేశారు. నేడు ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లంతా విజ్ఞతతో అలోచించి ప్రజలపక్షాన ప్రశ్నించే బీఆర్ఎస్ గొంతుకు మద్దతుగా నిలిస్తే కేవలం పట్టభద్రుల సమస్యల కోసమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు అండగా ఉండి పోరాడుతారని కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలన్నారు. ప్రపంచవ్యాప్త ఎన్నారైలంతా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రులను కోరారు.

 

BRS candidate should win as MLC of graduates
BRS candidate should win as MLC of graduates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *