- హాజరైన బీజేపీ నేత ఈటల రాజేందర్
వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హనుమకొండ కిషన్ పురలోని వాగ్దేవి కాలేజీలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రభారి డా.వి.మురళీధర్ గౌడ్, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పెసరు విజయచందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పులి సర్రోత్తం రెడ్డి, వాగ్దేవి సంస్థల అధినేత చందుపట్ల దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
