- కెసిఆర్ తనయ కవితకు ఇడి నోటీసులు
- 9న విచారణకు రావాలని ఆదేశాలు
- 15 తరవాత వస్తానంటూ కవిత లేఖ
- కవితకు నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్ నేతలు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణకు 9న గురువారం హాజరు కావాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇడి లేఖ రాసింది. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని వెంటనే కవిత కూడా బదులిచ్చారు. ఈ మేరకు
ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మార్చి 9న ఈడీ విచారణకు హాజరుకాలేనని లేఖలో తెలిపారు. ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న ఢల్లీిలో జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున సమయం కావాలని కోరారు. ముందస్తు అపాయింట్‌మెంట్స్ ఉన్నందున.. విూరు చెప్పిన టైంలో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ.. ఈడీకి కవిత లేఖ రాశారు. ఈ లేఖకు ఈడీ ఎలాంటి సమాధానం ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. 9వ తేదీన విచారణకు హాజరుకావాలని.. కవితకు ఈడీ నోటీసులు పంపించింది. మార్చి 10న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం.. ఢల్లీిలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయనున్న క్రమంలో కవిత ఈడీకి లేఖ రాసింది. కవిత రాసిన రిక్వెస్ట్ లేఖకు ఈడీ సానుకూలంగా స్పందిస్తుందా.. లేక షెడ్యూల్ ప్రకారమే హాజరు కావాలని ఆదేశిస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం అరుణ్ రామచంద్ర పిళ్లయ్ కస్టడీ మార్చి 13వ తేదీతో ముగుస్తుంది. కవిత మాత్రం 15వ తేదీ వరకు గడువు కోరింది. వీళ్లిద్దరినీ కలిసి విచారణ చేయాలనేది ఈడీ షెడ్యూల్ పెట్టుకుంది. ఈడీ సమయం ఇస్తే.. పిళ్లయ్ కస్టడీని పొడిగించాల్సి ఉంటుంది. కవితను ఎప్పుడు విచారించాలి.. ఎలా విచారించాలి.. కవిత లేఖను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది ఈడీ చేతుల్లోనే ఉంది. రాజకీయరంగంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో కవిత 10న జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టినట్లు కవిత తెలిపారు. ఈ క్రమంలోనే మార్చి 9న ఢల్లీిలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరి స్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను అని కవిత ముందు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢల్లీిలో ఉన్న అధికారకాంక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము అని కవిత స్పష్టం చేశారు. ఢల్లీి లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులపై ఈ రకంగగా కవిత స్పందించారు. నోటీసులు అందాయని.. వాటిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడిరచారు. మార్చి 9వ తేదీ విచారణ రావాలని నోటీసుల్లో ఉందని.. అయితే ముందస్తు అపాయింట్ మెంట్స్ ఉన్నందున.. రేపటి విచారణకు హాజరు కావాలా లేక నోటీసులపై లేఖ రాయాలా అనేది.. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడిరచారు. ఈ క్రమంలో ఆమె తన అనుచరులు, న్యాయ నిపుణులతో చర్చించి విచారణకు 15 తరవాత వస్తానని ఇడికి లేక రాశారు. మరోవైపు కవితకు ఇడి నోటీసులపై బిఆర్‌ఎస్ నేతలు భగ్గుమన్నారు. కావాలనే రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాల్లో భాగమని విమర్శించారు. బిజెపిక రోజులు దగ్గరపడ్డాయిన విమర్శించారు.
