Warangalvoice

CP Dr. Tharun Jyoshi

నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి

వరంగల్ వాయిస్, క్రైం: నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలపై నేరాలు, మిస్సింగ్, ఎన్.డి.పి.ఎస్, చిట్ ఫండ్, రోడ్డు ప్రమాదాలు, ఈ. పెట్టి కేసులకు సంబంధించి గత ఏడాదికి , ఈ సంవత్సరంలో గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన కేసుల వ్యత్యాసాలపై సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి విశ్లేషించారు. అనంతరం ప్రస్తుతం నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ , కేసుల దర్యాప్తు , రికవరీ, కోర్టులో పెండింగ్ వున్న కేసులు వాటి స్థితి గతులపై పోలీస్ కమిషనర్ కేసుల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మత్తు పదార్థాల విక్రయాలను కట్టడి చేసేందుకుగాను ప్రతి పోలీస్ అధికారి మరింత శ్రమించాల్సి వుంటుందన్నారు. గంజాయి రహిత పోలీస్ స్టేషన్ గా గుర్తింపు వచ్చే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తమ పరిధిలో గంజాయి అమ్మకాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పీడీయాక్ట్ క్రింద కేసులను నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు, అధికారులు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి రోడ్డు ప్రమాదాల కట్టడికి తగు రీతిలో చర్యలు తీసుకోవాలన్నారు.. నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో కీలకంగా నిలుస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్స్, రోడ్డు ప్రమాదాలపై ప్రజలతో పాటు విధ్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు మరిన్ని అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలియజేశారు. సమావేశంలో డీసీపీలు వెంకటలక్ష్మీ, అశోక్ కుమార్,సీతారాం, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి పాల్గొన్నారు.

warangal Police
A skilled investigation should be undertaken

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *