Warangalvoice

Simple budget allocations

నేడు లోక్‌సభ ముందుకు వార్షిక బడ్జెట్‌

  • మరోమారు బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నిర్మలమ్మ
  • జనాకర్శక బడ్జెట్‌ ఉంటుందన్న అంచనాలు
  • ఐటి మినహాయింపులపై వేతన జీవుల ఆశ

వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2023`24 బడ్జెట్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు, పలు రాష్టాల్ర ఎన్నికల నేపథ్యలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈసారి ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ మరోమారు బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ సారి బడ్జెట్‌పై బడుగు, వేతన జీవులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సంపన్నులకు ముఖ్యంగా ఆదానీ, అంబానీలకు అనుకూల సర్కారు అనే ముద్ర పడడం వంటి కారణాలతో ఈ సారి జనాకర్షక బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వివిధ రాష్టాల్ల్రో ఎన్నికలు జరగగబోతున్న క్రమంలో ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కొంతయినా జనాకర్శక విధానం అవలంబించే అవకాశం లేకపోలేదు. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన గంట తర్వాత రాజ్యసభలో బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. బడ్జెట్‌ సమావేశాల తొలి రెండు రోజులు ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌ ఉండవు. ముఖ్యంగా మధ్యతరగతికి ఆదాయపన్ను విషయంలో ప్రామాణిక తగ్గింపునును పెంచడంతోపాటు.. చిన్న, సూక్ష్మ వ్యాపార సంస్థలు, వ్యవసాయ, గ్రావిూణ రంగాలు, మహిళలకు చేయూతనిచ్చే అనేక పథకాలు ప్రవేశపెడతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకూ అనుసరించిన వైఖరికి భిన్నంగా ఈసారి బడ్జెట్‌ ఉంటుందని, రానున్న సంవత్సరాలకు దిశా నిర్దేశం చేస్తుందని ఈ వర్గాల అంచనా వేస్తున్నాయి. త్వరలో పలు రాష్టాల్రకు ఎన్నికలు జరుగుతున్నందున వీటిపై ప్రభావం ఉండేలా బడ్జెట్‌ ఉంటుందన్న చర్చ సాగుతోంది. బుధవారం ఉదయం 11గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ 2023`24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రవేశపెడతారు.రెండో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చకు కేటాయించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వర్గాలు వెల్లడిరచాయి. ఫిబ్రవరి 7న ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిచ్చే అవకాశం ఉంది.ఈసారి బడ్జెట్‌ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు తొలి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు. మూడు ఈశాన్య రాష్టాల్రతో పాటు త్వరలో పలు రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలపై అటు అధికారపక్షం, ఇటు విపక్షాలు ఆసక్తిగా తమ వైఖరితో ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ సమావేశాలను రాజకీయాలకు అనుకూలంగా ఉపయోగించుకుని ఒకరిపై మరొకరు పైచేయి నిరూపించేందుకు ఇరు వర్గాలు ప్రయత్నించ వచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. స్వల్పకాల వ్యవధి, సావధాన తీర్మానాలపై చర్చలతో పాటు బిల్లుల ఆమోదానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అంతేకాక బ్జడెట్‌ సమావేశాల్లో అత్యధిక సమయం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో పాటు.. బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చకే సరిపోతుంది. వాడివేడి చర్చలకు విపక్షాలు సిద్ధంవివిధ అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.ఇకపోతే వేతన జీవులతో పాటు పలువురు ఇన్‌కమ్‌ టాక్స్‌ వెసలుబాటు కోరుకుంటుననారు. జిఎస్టీ స్లాబుల్లో తగ్గుదల కావాలని కోరుకుంటున్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ వంటి సంస్థ కూడా దేశవ్యాప్తంగా విస్తరించలేకపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత బీమా.. హెల్త్‌ బీమా గురించి ఇండియన్లలో కొంత అవగాహన పెరిగింది. అందుకే గతేడాది బీమా పాలసీల కొనుగోళ్లలో కొంత పురోగతి నమోదైంది. ఇన్సూరెన్స్‌ రంగంలో ఇన్వెస్ట్‌ మెంట్స్‌ కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సర (2023`24) బ్జడెట్‌లో రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలని బీమా పరిశ్రమ ఆశిస్తున్నది. ప్రత్యేకించి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విూద జీఎస్టీ రేట్‌ తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థిస్తున్నది. ప్రతియేటా వేతన జీవులు సమర్పించే ఐటీ రిటర్న్స్‌లో మినహాయింపులు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్‌ కింద ఇచ్చే రాయితీలు పెంచాలన్న అభ్యర్థనలు వస్తున్నాయి. కనుక కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా వైద్య ఖర్చుల నుంచి రక్షణ కల్పించడానికి ప్రతి ఒక్కరూ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకునేలా సర్కార్‌ ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు. ఇప్పుడు మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు రిటైర్మెంట్‌ అయిన తర్వా నిలకడగా పెన్షన్‌ అందించే కొలువులు తక్కువ. కనుక ఉద్యోగ సమయంలోనే పలు పెన్షన్‌ స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టాలి. రిటైర్మెంట్‌ తర్వాత ఆయా పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంతో జీవనం సాగించాల్సి ఉంటుంది. అంతే కాదు.. ఇప్పుడు పెన్షన్‌`యాన్యుటీ పేమెంట్స్‌ టాక్స్‌ పరిధిలోకి వస్తాయి. జీవిత బీమా సంస్థల పెన్షన్‌ పథకాలపై ఆదాయం పన్ను చట్టం 80సీ సెక్షన్‌ కింద పన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది.

Annual budget before the Lok Sabha today
Annual budget before the Lok Sabha today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *