
- బిజెపి లక్ష్యంగా సమరశంఖం పూరించనున్న కెసిఆర్
- బిజెపికి ప్రత్యామ్నాయం చూపే దిశగా బిఆర్‌ఎస్ అడుగు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్ తొలి బహిరంగసభకు రంగం సిద్దం అయ్యింది. ఈనెల 18న బుధవారం సాయంత్రం జరిగే సభతో బిజెపికి సవాల్ విసిరేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ రంగం సిద్దం చేసుకున్నారు. 9 రాష్టాల్ల్రో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కెసిఆర్ అవినీతి పాలన అంటూ విమర్శలు చేస్తోంది. తెలంగాణలో అధికారం తమదే అని ప్రకటించుకుంది. ఈ క్రమంలో కేంద్రంలోని బిజెపిని చెండాడడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ తొలి అడుగు ఖమ్మం నుంచి వేయబోతోంది. బిజెపికి కెసిఆర్ సవాల్ విసరబోతున్నారు. అలాగే దేశంలో బిజెపిని ఎదుర్కొనేందుకు వివిధ ప్రాంతీయపార్టీలతో కలసి కెసిఆర్ బిఆర్‌ఎస్‌ను ముందుకు తీసుకుని వెల్లేందుకు పక్కా వ్యూహం సిద్దం చేసుకున్నారు. తెలంగాణలో బిజెపిని చావుదెబ్బ కొట్డంతో పాటు, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బిజెపిని పడ గొట్టేందుకు కెసిఆర్ తొడగొట్ట బోతున్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎజెండాగా చేసుకుని, విపక్ష పార్టీలను, దేశ రైతాంగాన్ని కూడగట్టేందుకు వేస్తున్న తొలి అడుగుగా ఖమ్మం నిలవ బోతున్నది. సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు ఢల్లీి సిఎం కేజ్రీవాల్, యూపి మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్, కేరళ సిఎం పినరయ్ విజయ్ కూడా ఖమ్మం సభకు వస్తున్నారు. మోడీని ఢీకొనేందుకు కార్యాచారణను కెసిఆర్ ఈ సభ నుంచే ప్రకటించ బోతున్నారు. సభకు తరలివెళ్లే ముందే సిఎం కెసిఆర్ ఇక్కడికి వచ్చి వివిధ రాష్టాల్ర సిఎంలు, పలువురు నేతలతో కలసి తొలుత యాదాద్రి దర్శనం చేసుకుంటారు. అక్కడి యాదాద్రి పునర్నిర్మాణం గురించి, ఇక్కడి ప్రాధాన్యతను వివరిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఖమ్మంలో నిర్వహించే బీఆర్‌ఎస్ భారీ బహిరంగసభకు సీఎం కేసీఆర్ సహా జాతీయ నేతలు వెళ్లనున్నారు. ఖమ్మం బిఆర్‌ఎస్ సభతో భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించడం లక్ష్యంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే దేశ ప్రజలను ,పార్టీలను ఆకర్శించే విధంగా ఖమ్మం సభకు భారీగా జనసవిూకరణ చేపట్టారు. కెసిఆర్ ఆదేశాలతో ఖమ్మంలోనే మకాం వేసిన మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో కేసీఆర్ కరీంనగర్‌లో సింహగర్జన నిర్వహించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ తొలిసభ ఖమ్మంలో నిర్వహించడం ద్వారా బిజెపికి ఓ హెచ్చరిక చేయాలని నిర్ణయించారు. ఖమ్మం సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభగా నిలిచిపోతుందని అంటున్నారు. ఖమ్మం సభలో పలు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా జన సవిూకరణ చేపట్టారు. ఇతర రాష్టాల్ర నుంచి ఖమ్మం సభకు బస్సులను సమకూరుస్తున్నారు.మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో బిజెపికి స్థానం లేదని చెబుతూనే దేశంలో మోడీ పతనం ప్రారంభం అయ్యిందన్న హెచ్చరిక చేయబోతున్నారు. ప్రధానంగగా రైతాంగ సమస్యలు, జిఎస్టీ, నదుల అనుసంధానం, నిరంతర విద్యుత్, తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను ప్రధానంగగా కెసిఆర్ ప్రస్తావించబోతున్నారు. ఇవన్నీ సాధ్యం అయినప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదన్న ప్రశ్నను లేవనెత్తుతారు