Warangalvoice

IMG 20240915 WA0052

నిమజ్జన వేళ ట్రాఫిక్ ఆంక్షలు

  • వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటి పరిధిలో వినాయక నిమజ్జనం సందర్బంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి నగరంలో పెద్ద స్థాయిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రై సిటి పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా రేపు అనగా 16-09-2024 మధ్యాహ్నం 12.00 నుండి మరుసటి రోజు తేది 17-09-2024 ఉదయం 10.00 గంటల వరకు ట్రాఫిక్  ఆంక్షలు కోనసాగుతాయి.

భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు..

1.ములుగు,భూపాలపల్లి వైపు నుంచి వచ్చు భారీ వాహనాలు హైదరాబాద్ కు వెళ్ళవలసినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్లాలి. భూపాలపల్లి పరకాల నుంచి ఖమ్మం వెళ్లవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుండి వెళ్లవలెను.

2.భూపాలపల్లి, పరకాల నుంచి వచ్చు భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్ళవలసినవి కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పీరిలు గొర్రెకుంట నుంచి వెళ్లాలి.

3.సిటి లోపలికి వచ్చు భారీ వాహనాలు సిటి అవతల ఆపుకోవలెను. నిమజ్జన సమయంలో ఎలాంటి వాహనాలు సిటి లోపలికి అనుమతించబడవు.

వరంగల్ నగరంలో తిరుగు వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు..

ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ, సీపీఓ అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్ కు చేరుకోవాల్సి ఉంటుంది.

హనుమకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి ములుగు వైపు, కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సీపీఓ ద్వారా కేయూసీయుసి, జంక్షన్ మీదుగా వెళ్లవలెను.

హనుమకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్లాలివ.

వరంగల్ బస్టాండ్ నుంచి హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుంచి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హనుమకొండ చేరుకోవాలి.

వినాయక నిమజ్జన వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు:

సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం చేయు విగ్రహాలు 6 అడుగుల ఎత్తు వరకు ఉండి ట్రాక్టర్, TATA ACE లలో వచ్చే వాటిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అట్టి శోభాయాత్ర హంటర్ రోడ్, అదాలత్, సీపీఓ, హనుమకొండ చౌరస్తా, బాలాంజనేయ స్వామి టెంపుల్ మీదుగా వెళ్లి నిమజ్జనం అనంతరం వయా శాయంపేట మీదుగా తిరిగి వెళ్లవలెను.

హనుమకొండకు చెందిన భారీ వినాయక విగ్రహాలు కోట చెరువు లేదా చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనానికి వెళ్లాలి.

కోట చెరువు వైపు నిమజ్జనం కోసం వెళ్లే వాహనాలు పెద్దమ్మగడ్డ, ములుగు జంక్షన్, యం.జి.యం, ఆటోనగర్ మీదుగా కోటచెరువుకు వెళ్లాలి. కోట చెరువులో వినాయక విగ్రహ నిమజ్జన అనంతరం వాహనాలు హనుమాన్ జంక్షన్ , పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ జంక్షన్ మీదగా తిరిగి వెళ్లవలెను.

ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయవలెను.

చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేయు విగ్రహాలు కాశిబుగ్గ, పోచమ్మ మైదాన్, దేశాయిపేట మీదుగా వెళ్లి నిమజ్జనం అనంతరం వయా ఎనుమాముల మార్కెట్ నుంచి కాశిబుగ్గ మీదుగా తిరిగి వెళ్లాలని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *