Warangalvoice

hnk 24

నిత్యావసర సరుకుల పంపిణీ

వరంగల్ వాయిస్, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకుల బోరు అనే ఆదివాసి గ్రామాల్లో గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది. తదనంతరం అక్కడ ఆదివాసి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు ఆధ్వర్యంలో గ్రామంలో 55 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ ఉల్లిగడ్డ, కేజీ ఆలుగడ్డ, కేజీ పప్పు తదితర నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా కృష్ణబాబు మాట్లాడుతూ వరదల వల్ల సర్వం కోల్పొయిన వీరికి స్వచ్ఛందంగా కొంతమంది మానవతవాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇల్లు పోయినవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, తక్షణ సాయం కింద కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు త్వరగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, అమ్మ స్వచ్చంద సేవా సంస్థకి ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోధబోయిన పరమేశ్వరరావు, సర్పంచ్ సూరిబాబు, గడ్డం వివేక్ రాఘవులు, బి.తిరుపతి, వెంకట కృష్ణ, కిషోర్, శేఖర్, మోహన్ రావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *