‘ఓ నిజాము పిశాచమా! కానరాడు..నిన్ను బోలిన రాజు
మాకెన్నడేని..తీగలను తెంపి అగ్నిలోకి దింపినావు..
నా తెలంగాణ కోటి రత్నాల వీణ..
ఈ పద్యం వినని, తెలియని తెలంగాణావారుండరు. ఒక్కోసారి అన్పిస్తుంది ఇలాంటి పద్యాలే కవులు రాయకపోతే తెలంగాణ ప్రాంతీయ స్పృహ అందరిలో పుట్టేదా? అని. అటువంటి పద్యాలు, వచనాలు ఎన్నో ఈనేలన పురుడు పోసుకున్నాయి. మానులై ఎన్నో విజయాలూ అందించుటలో సహకరించాయి. అలాంటి ఉద్యమ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యంలో తెలంగాణా అనగానే సాధారణంగా గుర్తొచ్చే కవి దాశరథి కృష్ణమాచార్యులు.నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారి వ్యవస్థను, అన్యాయం, అధర్మం ఉన్న ప్రతి చోటా కవితాశక్తి ధిరోదాత్తుడై కనిపించినవాడు దాశరథి. ఆయనలోని కవితాధార ఎందరో పీడిరచేవారిని గజగజ వణికించింది. అది అగ్నిధారై ప్రవహించింది. రుద్రవీణై వినిపించింది. అమృతాభిషేకం కురిపించి కవితా పుష్పకంలో వికసించింది. అట్లాంటి తెలంగాణా వైతాళికుడు దాశరథి. దగాకోరు బడాచోరురజాకారు పోషకుడవువూళ్ల కూళ్లు అగ్గివెట్టిఇళ్లన్ని కొల్లగొట్టిపెద్దరికం చేస్తావాదిగి పొమ్మని` దిగి పొమ్మని పదేపదే అనేస్తానుదిగిపోవోరు`తెగిపోవోరు‘ అంటూ నిజాంను నిలదీశాడు. తర్వాత అరెస్టయి నిజామాబాద్ జైల్లో బంధించబడినాడు. అయిననూ ఎక్కడా వెనుదిరగక అనేకనేక రచనలు నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ జైలు గోడలపై బొగ్గుతో రాసి మన తెలంగాణ మట్టి పౌరుషాన్ని అడుగడుగునా ప్రదర్శించిన అసలైన, నిఖార్సయిన తెలంగాణా కవి దాశరథి కృష్ణమాచార్యులు.
వరంగల్ వాయిస్, బ్యూరో: దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో జూలై 22, 1925న జన్మించాడు. వెంకటమ్మ, వెంకటాచార్యులు ఆయన తల్లిదండ్రులు. తల్లి నుండి మానవత్వం, తండ్రి నుండి పాండిత్యం అతనికి చిన్ననాటి నుంచే ఒంటబట్టాయి…
ఓ నిజాం పిశఆచమా అని డకటిటనా ఓ ఉద్యమాన్నికవిత్వాన్ని సమాహారంగా మలుచుకున్న ఘనత డాక్టర్ దాశరథి కృష్ణమాచారి గారిదే. నాటి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా కళా ప్రపూర్ణ, పద్మశ్రీ బిరుదుతో గౌరవింపబడిన దాశరథి అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం మొదలగు రచనలు చేశారు. నా తెలంగాణ కోటి రథనాల వీణ అని సగర్వంగా ఎలుగెత్తి చాటిన నవ్య కవిత వైతాళికులు దాశరథి. ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని తగెలను తెంపిరిగ్గిలో దింపినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణ! అని నిజామాబాద్ జైలు నుంచి రణన్నినాదము చేసినారు దాశరథి కృష్ణమాచార్య. ‘సారే బహుసే అచ్చా’ అని ఒక్క ఇక్బాలే ‘కోటి రతనాల వీణ’ అని దాశరథి మాత్రమే అనగలిగారన్నారు. హైదరాబాద్ నందలి కొందరు ముస్లింలు వ్యవస్థాపూర్వకంగా వింత వింత స్వప్నములు గని మహ్మదీయులెల్లరు రాజులనియూ మహ్మదీయులు లేకున్న రాజు లేడనియూహద్దూ పద్దూ లేని అడంబరములు ప్రదర్శించి ఆందోళనకు కారకులైరి. స్వాతంత్ర్య పోరాటములు విరివిగా హైదరాబాద్ సంస్థానముల యందు సాగింపబడినవి. ఈ ఉద్యమముల యందు సాగింప బడినవి. ఈ ఉద్యమముల ననుఛుటకై ఒక దానికంటే ఒకటి కఠినముగా శాసనము గావించబడినవి. క్రూరముగా కొట్టబడి నానా విధములగు హింస సహింపలేక ఎన్నియో ఆస్తులను ప్రజలు ఇండ్లు వదలి వలస పోవలసి వచ్చింది. ఇన్ని హింసా పద్ధతులు అవలంభించినప్పటికి స్వాతంత్ర్యోద్యమం అణచబడలేదు.
ఈ మహాయజ్ఞము యొక్క ఫలితం ఈనాడు గాకున్నా రేపైనను సంస్థాన ప్రజలకు లభించక తీరదని ప్రపంచ చరిత్రయే మనకు చాటుచున్నది. ఇది రావి నారాయణ రెడ్డి అధ్యక్ష ఉపన్యాసంలోని భాగం, అంతకు ముందు ఏ సభలోనూ ముస్లింలను ఇంత స్పష్టంగా హెచ్చరించలేదు. ఇతర సంస్థానాల పోరాటాలను ప్రస్తావించి స్వాతంత్ర్య ఉద్యమాలను అణచలేరనీ, చరిత్రలో ప్రభువులు గెలవలేరనీ ప్రజలే గెలుస్తారనీ చెప్పడం విశేషం. జీవనయానం పేజీ 177లో డా.దాశరథి రంగాచార్య పేర్కొన్నారు. తెలంగాణకు ఏనాడు రాజకీయ ప్రతిపత్తి లేదు. తెలంగాణకు పోరాట ప్రతిపత్తి ఉంది. ఉద్యమ ప్రతిపత్తి ఉంది. విప్లవ ప్రతిపత్తి ఉంది. ప్రజా పోరాటల మూలాంగానే తెలంగాణ పోరాటం ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో వ్యక్తం అవుతుంది. భారత స్వాతంత్ర్య సమరానికి కవుల, రచయితల, కళాకారుల స్పందన అంతగా కనిపించదు. ఉద్యమ స్ఫూర్తితో సాహిత్యం రాలేదనడం పొరపాటు. కాని అరవయి సంవత్సరాల దీర్ఘ పోరాటానికి రావలసినంత సాహిత్యం రాలేదు అయిదేళ్ళ తెలంగాణ పోరాటంలో అరవై ఏండ్ల స్వాతంత్ర్య పోరాటంలో వచ్చిన దానికన్న వాసిలోనూ, రాసిలోనూ అనంతం అయిన సాహిత్యం ప్రభవించింది. పోరాట కాలంలో అజ్ఞాత కవులు ఆవిర్భావించారు. జానపద కళారూపాలు బుర్రకథ, జముకుల కథ, గొల్లసుద్దులు, కోలాటం, ఉయ్యాలపాట, భాగోతం, ధూలఫకీరు పాట మున్నగు వానిలో సాహిత్యం అవతరించింది. సుద్ధాల హనుమంతు, యాద తిరునగరి ఆంజనేయులు, నాజర్ వంటి కళాకారులు రచనలు చేశారు. ప్రదర్శనలు ఇచ్చారు. వట్టికోట ఆళ్వార్ స్వామి, పొట్లపల్లి రామారావు, కాళోజీ ‘నాగొడవ’ దాశరథి కృష్ణమాచార్య ‘అగ్నిధార-రుద్రవీణ మహభోది, నాగార్జున చరిత్ర మహేంద్రోదయం కవిత పుష్పకుల అమృతోభిషేకం నవమంజరి బాలగేయాలు, గాలిబ్ గీతాలు, కశిల దాశరథి శతకం, ఒకవైపు కవిత సంపుటిలను రచించారు. మరోవైపు తెలంగాణ రచయితలు సంఘాన్ని స్థాపించి ఉద్యమించారు.
ఒకవైపు సాంప్రదాయ కవిత్వం, మరోవైపు రచన గేయ కవిత్వం ఒకసారి ప్రళయ కవిత్వం మరోసారి ఏది పలికినా కవిత్వమంటే తను రాసిందే అనిపించిన మహానీయుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య తన కవిత చేయూతలో ఆధునికాంధ్రాకాశంలో పునర్నణ అమృతాభిషేకం, మహేంద్రోదయం ఇత్యాది అనేక అక్షర నక్షత్రాలను సృష్టించారు. నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారునిగా అవిశ్రాంత పోరాటం సలిపి తెలుగు సంస్కృతికి వారసుడిగా ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా కీర్తి శిఖరాలను అధిరోహించారు. సామాజిన సమస్యను ఇతివృత్తంగా తీసుకొని కవితలు రాయడమే గాక ఎన్నో సినీ గీతాలు, 1969 నుంచి 1978 వరకూ దాదాపు రెండు వేలకు పైగా రచింని పాటలు, ఎన్నో లలిత గేయాలు సైతం అనేకం ఆయన లేఖ నుంచి వెలువడ్డాయి. ఉర్దూ గజల్ సుప్రసిద్ధమైంది. రెండు వందల ఏళ్ళ క్రితమే ఈ గజల్ కవిత సాంప్రదాయంలో శృంగారానికి పెద్ద పీట వేయగా తేటగీతులలో అత్యంత రమణీయంగా దాశరథి అనువధించి తెలుగు వారికి కానుకగా పెట్టారు.
ఇలా తన జీవితాన్ని తుది వరకు సాహిత్య సేవకు ధారపోసిన ఆయన కవిత్వాన్ని తుది వరకు సాహిత్య సేవకు ధారపోసిన ఆయన కవితా పుష్పకం కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందారు వరంగల్ జిలాల మరిపెడ మండలం చిన్న గూడూరుకు చెందిన దాశరథి వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు 1925 జూలై 22న దాశరథి కృష్ణమాచార్యులు జన్మించారు. భూమి కోసం, భుక్తి కోసం, భానిసత్వ విముక్తి కోసం తెలంగాణ రైతాంగం ఆయుధాలను పట్టినపుడు తనవంతు కర్తవంగా దాశరథి అక్షరాన్ని ఆయుధంగా పదను పెట్టి పోరాట రంగంలోకి దుమికారు. కొంత కాలం అజ్ఞాత జీవితాన్ని గడిపి ప్రజల కష్టాలకు స్పందించి, జన్మనిచ్చిన తెలంగాణను తెలంగాణా పల్లెల్లో పుట్టి అక్కడ మట్టి వాసనను ఆస్వాధించిన దాశరథి వారిలో నిద్రాణమైన ప్రజా చైతన్యాన్ని పెలులబికించేలా రాసిన కవిత్వాన్ని మన జాతీయ సాహితీ సంపదగా గుండెల్లో దాచుకోవాలి. 1943 నుంచి 1947 వరకు జాగిర్ధారీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా గార్లలో ఉద్యమాలను నడిపారు.
కొండపలిల గోపాలరావు శిష్యుడిగా చేరి జాగిర్ధార్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1947లో హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న దాశరథిని వరంగల్, నిజామబాద్, హైదరాబాద్ చెంచల్ గూడా జైళ్ళలో నిర్బంధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన కవితల ద్వారా జాగిర్ధార్ పాలనలో ప్రజల నికృష్ట జీవన విధానాలను వెలుగెత్తి చాటారు. 1972లో అప్పటి ప్రధాన శ్రీమతి ఇందిరాగాంధీ తామర పత్రం ప్రదానం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతో సత్కరించింది. ఆగ్రా విశ్వవిద్యాలయం 1981లో డాక్టర్ ఆఫ్ లెటర్స్ తో దాశరథి కృష్ణమాచార్యుని గౌరవించింది. సాహితీ ప్రపంచంలో ధృవతారగా వెలిగిన దాశరథి కృష్ణమాచార్య 1987 నవంబర్ 5న , 61వ ఏట హృద్రోగంతో కన్నుమూశారు. ఆయన తెలుగు సాహితీ రంగంలో వెలుగు జీలుగులను నింపిన చిరస్మరణీయుడు. తెలంగాణ సంస్కృతిని ప్రాభవాన్ని చాటి చెప్పిన మహానీయుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దాశరథి అవార్డును తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి ప్రదానం చేస్తోంది.
తెలంగాణలో సాహిత్య రంగంలోన విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందజేస్తున్న శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును ఈ ఏడాది (2023)కి గాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతవధాని అయాచితం నటేశ్వర శర్మకు అందజేయనుంది. ఈనెల 22న రవీంద్రభారతిలో జరిగే ఎ దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా నటేశ్వర శర్మకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అవార్డుతో పాటు లక్ష వెయ్యి నూట పదహార్ల నగదు, శాలువా, జ్ఞాపికను బహూకరిస్తారు.

కొలనుపాక కుమారస్వామి, వరంగల్
సెల్: 9963720669