- జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ
వరంగల్ వాయిస్, కన్నాయిగూడెం : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరిత గతిన పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. మంగళవారం కన్నాయిగూడెం మండలం లోని సింగారం, ఏటూరు, కంతనపల్లి గ్రామాలలోని పాఠశాలలలో జరుగుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పి.శ్రీజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తరగతి గదుల్లోని లైట్ లు, ఫ్యాన్ల నిర్వహణను పర్యవేక్షించారు. మరుగుదొడ్లను పరిశీలించి, వాటిపై రూఫ్ ను, తలుపుల మరమ్మతులను సరైన విధంగా అమర్చాలని సిబ్బందిని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలకు వచ్చే విద్యార్దులకు పాఠశాల వాతావరణం ఒక నూతన అనుభూతిని కలిగించే విధంగా పాఠశాల పరిసరాలను ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల ప్రత్యేక అధికారి ఏపీడీ వెంకటనారాయణ, ఎంపీడీవో, ఎంఈవో రాజేష్, పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
