- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
- పది వేల తక్షణ ఆర్థిక సాయం
- ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని హామీ
- పద్మశాలి కులస్తుల ఆర్థిక సాయం చెక్కు అందజేత
- కుల కట్టుకుని దర్శనం ఈ చేయూత
- బాధిత కుటుంబానికి అభయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
- హాజరైన పద్మశాలి కుల పెద్దలు
వరంగల్ వాయిస్, హన్మకొండ : నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన నవీన్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా నిలబడతామని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. హనుమకొండ కుమార్ పల్లి కి చెందిన నిరుపేద పద్మశాలి కులస్తుడైన నవీన్ భార్య నిఖిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సొంత ఇల్లు లేకపోవడంతో కర్మకాండలు స్మశాన వాటిక లోనే ఉంటూ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అఖిల భారత పద్మశాలి హనుమకొండ జిల్లా కమిటీ వెంటనే స్పందించి ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని పద్మశాలి కులస్తులు తోచిన సహాయం చేయడంతో వచ్చిన లక్షా 60 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కులస్తులంతా ఒక్కటై తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేయడం హర్షించదగ్గ విషయమని, మిగతా కులస్తులు ఈ ఆర్థిక సాయం ను ఆదర్శంగా తీసుకొని నిరుపేదలకు బాసటగా నిలువాలన్నారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే అభయ హాస్పిటల్ స్పందించి బాధ్యత కుటుంబానికి పదేళ్లపాటు ఉచిత వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చింది. అఖిలభారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్ మాట్లాడుతూ కుల ఐక్యతకు నిదర్శనం ఈ కార్యక్రమం అని, పద్మశాలి కులస్తులంతా నిరుపేదలకు సాయం చేయడానికి ముందుకు రావాలని, మునుముందు కమిటీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి ఉమ్మడి వరంగల్ జిల్లాల సంఘం అధ్యక్షులు బచ్చు ఆనందం, ఆడెపు రవీందర్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు,రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్, తవుటం రవీందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు పోరండ్ల రమేష్, వెంగల వేణుగోపాల్, ప్రచార కార్యదర్శి పులికంటి రాజేందర్, కోశాధికారి సత్కూరి సంతోష్ రాజ్, కార్యవర్గ సభ్యుడు వెంగళ బాలకృష్ణ,గోలి రవి,కుల బాంధవులు పాల్గొన్నారు.