కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్
వరంగల్ వాయిస్, హనుమకొండ : నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావడం ఖాయమని 60 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ కి మద్దతుగా ఆదివారం 60వ డివిజన్ వడ్డేపల్లి లోని మిడిదొడ్డి వాడ, కటకంవాడ, కట్క వాడ లలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ప్రచారం లో పాల్గొని నరేంద్రమోడీ అభివృధి కార్యక్రమాలు వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీరంగం సాగర్, 60వ డివిజన్ అధ్యక్షులు సతీష్, ప్రధాన యాదగిరి, అడప రాము, సాగర్ గౌడ్, నరేష్, బాబీ, చందు, సంతోష్, కటకం రాజు, కందికొండ రాజు, రాజేష్, హరీష్, రాము, శ్యామ్, సతీష్, బూత్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
