Warangalvoice

Strict action if fake seeds are sold

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

వరంగల్ వాయిస్, మహబాబాబాద్ : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి కె. అభిమన్యుడుతో కలిసి మహబూబాద్ పట్టణంలోని విత్తన దుకాణం, కిసాన్ అగ్రిమాల్ ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా విత్తన దుకాణాల్లో ఉన్న పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న విత్తనాల స్టాక్ వివరాలు స్వయంగా పరిశీలించడం జరిగింది. ధరల పట్టిక ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, రోజు వారీగా జరిగిన అమ్మకం, రైతుల వివరాలు, రైతుల వారీగా అమ్మిన విత్తన రిజస్టర్లను పరిశీలించారు. దుకాణంలో అనుమతిలేని విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మే విధంగా చూడాలని తెలిపారు. ప్రతిరోజు వచ్చిన సరుకు వివరాలు, రైతులకు అమ్మిన విత్తనాల వివరాలు, ముగింపు స్టాక్ -వివరాలు రికార్డులో రాయాలని, లూస్ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించరు. జిల్లాలో డివిజన్, మండలాల వారీగా టాస్క్ ఫోర్స్ టీంలు ( పోలీస్, రెవెన్యూ, వ్యవసాయశాఖ) అధికారులతో ఏర్పాటు చేశమని, ఈ టాస్క్ ఫోర్స్ టీంలు ప్రతి రోజు విత్తన దుకాణాలను తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకొని ప్రతిరోజు రిపోర్ట్-సబ్మిట్ చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Strict action if fake seeds are sold
Strict action if fake seeds are sold

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *