- భార్యభర్తల మృతి
వరంగల్ వాయిస్, పరకాల : నడి కూడ మండలం ధర్మారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం 6.30గంటల సమయంలో హనుమకొండ నుంచి పరకాలకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని పరకాలకే వస్తున్న కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న పరకాల పట్టణ కేంద్రానికి చెందిన భార్య, భర్తల్లో భర్త పసుల మొగిలి (55) అక్కడికక్కడే మృతి చెందాగా భార్య సావిత్రికి (50) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పరకాల ఎస్ఐ శివకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మొగిలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల తరలించారు. కారు డ్రైవర్ తోపాటు యజమాని పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
