Warangalvoice

Modi should win for the development of the country

దేశాభివృద్ధి కోసం మోడీని గెలిపించాలి

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : దేశ రక్షణ, సమగ్రత కోసం బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మొదటిప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెడవెల్లి రాజవర్థన్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నికలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని, నేటికి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉందన్నారు. ప్రధాని మోడీ వరంగల్‌కు రైల్వే కోచ్‌ను మంజూరు చేసి దాని నిర్మాణం కోసం రూ.800 కేటాయించారని చెప్పారు. గిరిజన యూనివర్శిటీతో పాటు రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని పునఃప్రారంభించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500 ఇస్తామని నేటికి అమలు చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగులు ఇప్పటికైన ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వర్‌రావు, యాప సీతయ్య, బోయినపల్లి లక్ష్మణ్‌రావు, మొసంగి మురళి, ఆకుల శ్రీనివాస్‌, ధర్మారపు వెంకన్న, పైండ్ల శ్రీనివాస్‌, రామడుగు వెంకటాచారి పాల్గొన్నారు.

Modi should win for the development of the country
Modi should win for the development of the country

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *