రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ వ్యవస్థాపకులు డాక్టర్
కేశవరావు హెగ్డేవార్ జయంతి ఏప్రిల్ 1న
వరంగల్ వాయిస్, కల్చరల్ : ఆయన ఆదికేశవుడు, ఆయన ఆత్మ బలరాముడు ఆయన అవిశ్రాంత వార్ కు ప్రతిరూపం అన్ని అంకాలలో తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ మహనీయ నాయకుడు డాక్టర్ బలిరాం హెగ్డే వార్ 134 సంవత్సరాల క్రితం జన్మించి ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ పతాకంగా రెపరెపలాడుతున్న వాడు అందరి చేత వందనాలు అందుకుంటున్న వాడు పెద్దవారు 1889 ఏప్రిల్ ఒకటో తేదీన ఉగాది పర్వదినాన నాగపూర్ లో డాక్టర్ కేశవ బలిరాం హెడ్డేవారు జన్మించారు. డాక్టర్ జీ పుర్వీకులు నిజామాబాద్ జిల్లా వాసులు. కేశవరావ్ ఆజన్మ దేశభక్తులు. మనల్ని బానిసరలుగా చేసి పాలిస్తున్న విదేశీయులను ఈ దేశం నుంచి ఎలా పంపించాలా అని ఆయన బాల్యం నుంచే బలంగా ఆలోచించేవారు హెగ్డే వార్ “నీట్ సీట్” హైస్కూల్లో చదివే రోజుల్లో దేశంలో వందేమాతరం ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో పర్యవేక్షణ కోసం వచ్చిన అధికారికి “నీట్ సీట్” హైస్కూల్లో వందేమాతరం నినాదంతో స్వాగతం పలికి ఉద్యమానికి నేతృత్వం వహించారు పర్యాయవసంగా ఆయనను స్కూల్ నుంచి టి,సి ఇచ్చి పంపించేశారు. 1921 సంవత్సరంలో గాంధీజీ నేతృత్వంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ఆ సమయంలో గ్రామాలలో డాక్టర్ జి ప్రభుత్వాన్నికూలదోయ్యాలని ఉపన్యాసాలు ఇస్తున్నారని కోర్టులో కేసు పెట్టారు. జడ్జి ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించారు. 1920 లో తిలక్ మరణించిన తర్వాత కాంగ్రెస్కు గాంధీజీ నాయకత్వం వహించారు. డాక్టర్ జి కాంగ్రెస్ ఉద్యమంలో పూర్తిగా విలీనమై పనిచేశారు. 1920లో నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాని కార్యదర్శిగా పనిచేశారు. మధ్య భారతలోని ప్రతి గ్రామంలో డాక్టర్ జి సుపరిచితులు ఆయన ఎటువంటి పదవికాంక్ష లేకుండా నిస్వార్ధంగా పనిచేయడంతో ఇటు ప్రజల అటు నాయకుల మన్ననలకు పాత్రులయ్యారు. డాక్టర్ కోర్స్ చదవడానికి హెగ్డే వార్ కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ విప్లవకారులతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు విప్లవకారులతో భుజం భుజం కలిపి పనిచేశాడు. 1925లో కలకత్తా వైద్య కళాశాల నుండి ఎల్ ఎం అండ్ ఎస్ పట్టా పొంది సంసారిక సుడిగుండాలలో గాని ధన సముపార్జనా తాపత్రయంలో కానీ పడలేదు. వివిధ సామాజిక రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ నిశితంగా అధ్యయనం చేశారు. తీవవాద కార్యకర్తను కాంగ్రెస్ పార్టీతోను వారికి గనిష్టమైన సంబంధం ఉండేది. ఆఖరకు వారు హిందూ సమాజంలోని వ్యక్తులతో జాతీయ భావాన్ని జాగ్రత్తలు చేసి వారందరినీ సంఘటిత పరచడం జాతి ఉన్నతికి ఉత్తమ సోపామానమని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారు 1925 వ సంవత్సరం విజయదశమి పర్వదినాన కొంతమంది మిత్రులతో హిందూ సంఘటన విషయమై చర్చించారు ఆనాటి సమావేశంలో సమస్త పేరు విషయాలపై గాని నియమ నిబంధనావళి కానీ ఆఫీస్ సైన్ బోర్డు పబ్లిక్ సిటీ గాని చర్చనీయంశాలు కావు. కేవలం హిందూ సమాజం ఉన్నతికి ప్రయత్నం చేయాలన్న విషయం నిశ్చయం చేశారు. ఈ విధంగా 1926 ఏప్రిల్ వరకు సంఘ పనులు కొనసాగాయి. సంఘం ఆరు నెలలు దాకా పేరు లేకుండానే జరిగింది తర్వాత డాక్టర్ మోహిత్ వార్డ్ మైదానాన్ని శుభ్రం చేసి 27, 28 మే 1926 లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘము ప్రారంభించారు. దీనిని వారు ప్రథమ శాఖ అంటారు. 1928 విజయదశమి నాడు స్వయంసేవకులు మొట్టమొదటి ఘోష్ సహిత పథ సంచాలనం చేశారు. ఆనాటి గణవేష అయిన ఖాకీ నిక్కరు, ఖాకీ కమీసు, రెండు గుండీలు ఉండే కాకి టోపీ ధరించారు. దీంతో చాలామంది సంఘ పెద్దలు నడిచారు బిగిల్ (శంక) డ్రం (ఆసన్)ను సైనిక్ అధికారుల వద్ద నేర్చుకోవడం వల్ల మొదట్లో ఆంగ్లంలో ఉండేవి. ఈమధ్య జరిగిన మార్పుల్లో వాటిని భారతీయ భాషలోకి మార్చారు. గోష్ సహిత రూట్ మార్చ్ చూసి ప్రభావితులైన ప్రముఖులలో నేతాజీ బోస్ ఒకరు ఇండియన్ జింఖానా మైదానంలో జరిగిన పదసంచాలం చూసి ఆనందం వ్యక్తం చేశారు. గత 98 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ తక్కుమేమీ సాధించలేదు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త రాష్ట్రీయ స్వయంసేవక్ సన్ వ్యవస్థాపకులు కేశవరావు బలి రావు హెగ్డే వార్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి శతకోటి వందనాలతో…
– కొలనుపాక కుమారస్వామి
సెల్ : 9963720669