Warangalvoice

Politics is more important than economic development in the country

దేశంలో ఆర్థికాభివృద్ది కన్నా రాజకరీయాలకే ప్రాధాన్యం

  • ఆర్థిక అభివృద్దిపై దృష్టి సారిస్తే నంబర్‌ వన్‌ స్థాయికి చేరుతాం
  • ’డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అంశంపై నిర్వహించిన సదస్సులో కెటిఆర్‌
    వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారని మంతరి కెటిఆర్‌ అన్నారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడిరచారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్‌ మన దేశం నుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ’డీకోడ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మనదేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. మొత్తం జనాభాలో 60 శాతం మంది యువతేనని తెలిపారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నదని వెల్లడిరచారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయడం లేదన్నారు. సింగపూర్‌ విస్తీర్ణంలో హైదరాబాద్‌ కన్నా చిన్నగా ఉంటుంది. అయినా అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తున్నదని చెప్పారు. గత ఎనిమిదేండ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది. దేశ జీడీపీలో 5 శాతం వాటా తెలంగాణదే అని తెలిపారు. 4.6 ట్రిలియన్‌ ఎకానవిూకి తెలంగాణ చేరుకుందన్నారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌, ఇంక్లూజిన్‌ గ్రోత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడిరచారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 15 రోజులు దాటితే సంబంధిత అధికారి నుంచి రోజుకు రూ.వెయ్యి చొప్పున ఫెనాల్టీ వసూలు చేస్తున్నామని చెప్పారు. గత 75 ఏండ్లలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాప్ట్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థల తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయన్నారు. ప్రపంచ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ వెలుగొందుతున్నదని తెలిపారు. 1/3వ వంతు వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని వెల్లడిరచారు. ఐటీ, అగ్రికల్చర్‌ గ్రోత్‌ ప్రతిఏడాది పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను నాలుగేండ్లలోనే పూర్తిచేశామన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు.

    Politics is more important than economic development in the country
    Politics is more important than economic development in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *