Warangalvoice

Corona cases are increasing in the country

దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

  • ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కేసుల సంఖ్య
    వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్టాల్ల్రో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రికార్డ్‌ స్థాయిలో ఒక్కరోజులో 300 కరోనా కేసులు నమోదైయ్యాయి. గత 6 నెలల తర్వాత మొదటి సారి రోజువారి కరోనా కేసులు 300 దాటాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలపై మార్చి 30వ తేదీన గురువారం ఢిల్లీ ప్రభుత్వ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సౌరబ్‌ భరద్వజ్‌ కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఇక దేశంలో వారంరోజుల క్రితం వరకు వెయ్యికి పరిమితమైన రోజువారి కోవిడ్‌ కేసుల నమోదు.. తాజాగా 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,016 కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో 24గంటల్లో దాదాపు 40శాతం కోవిడ్‌ `19 కేసుల సంఖ్య పెరిగింది. రోజువారీ కేసుల విషయంలో దాదాపు ఆరు నెలల్లో ఇదే అత్యధికం. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా పెరిగింది. దేశంలో 13,509 మంది కొవిడ్‌ తో చికిత్స పొందుతున్నారు. దీంతో పాజిటివిటీ రేటు 2.73శాతంకు చేరింది. వారం క్రితం పాజిటివిటీ రేటు 1.71శాతం ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్‌`19 కారణంగా 14 మంది మరణించారు. దీంతో ఇప్పటికే దేశంలోకరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,862 కు చేరింది. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు మరణించారు. కోవిడ్‌ కేసుల రికవరీ రేటు 98.78శాతం ఉంది. వారం రోజుల వ్యవధిలోనే కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Corona cases are increasing in the country
Corona cases are increasing in the country

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *