- పెద్దపల్లి ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు.
- పేదల ప్రజల సంక్షేమం కోసమే సన్న బియ్యం
- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
- జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం
వరంగల్ వాయిస్, పెద్దపల్లి : ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో రేషన్ షాపుల ద్వారా పంపిణి చేసే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కార్డు దారులకు బుధవారం బియ్యం పోసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో పేదవర్గాల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందని ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తామని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వ పథకాల కోసం ఎంపిక చేసిన నిమ్మనపల్లిలో 153 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే కేవలం 20 వరకు మాత్రమే పనులు ప్రారంభించారని, కొంతకాలం చూశాక కట్టుకోలేనివి క్యాన్సిల్ చేసి పెద్దపల్లి నియోజక వర్గంలో ఈ నెల 15 నుంచి ఊరికి 80 నుంచి100 ఇండ్లవరకు మంజూరు చేసి అర్హులైన వారందరరూ కట్టుకునేలా ఇల్లు కట్టుకునే వారందరికి వచ్చేలా చూస్తామన్నారు.
అనంతరం పెద్దపల్లి మండలం నిట్టూరు ఊరచెరువు మత్తడి వద్ద రైతుల సౌకర్యార్థం రూ.20 లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణపనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపుకలెక్టర్ డి. వేణు, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్ , పెద్దపల్లి ఆర్డివో బొద్దుల గంగయ్య, తహసీల్దాల్ రాజయ్య యాదవ్, ఏవో, ప్రత్యేకాధికారి కాంతాల అలివేణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
