మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు
వరంగల్ వాయిస్, ప్రయాగరాజ్ : ప్రపంచంలో అతిపెద్ద మత సంస్కృతి పండుగ అయిన మహా కుంభమేళా 2025 ఉత్సవం ఈసారి కీలక మార్పులతో జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో భక్తుల రద్దీ, రవాణా వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపి ప్రభుత్వం మరింత పక్కాగా ఏర్పాట్లు చేసింది. అందుకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి ఉత్సవం సక్రమంగా నిర్వహించేందుకు తోడ్పడనున్నాయి. ఈ మార్పులు భక్తులు సురక్షితంగా ఆయా ప్రాంతాలను చేరుకోవడానికి సహాయపడతాయి.