- టెన్త పరీక్షా కేంద్రాలవద్ద కోలాహలం
వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలుగు రాష్టాల్ల్రో పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ లో ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలను ఎస్‌ఎస్‌స్సీ బోర్డు నిర్వహించనుంది. ఏప్రిల్ 3 నుండి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనమతించారు. పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 2652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం విద్యార్థుల్లో అబ్బాయిలు 2,43,852, అమ్మాయిలు 2,41,974 ఉన్నారు. అలాగే 3,78,794 మంది విద్యార్థులు ఇంగ్లీష్ విూడియంలో పరీక్ష రాయనుండగా.. 98,726 మంది విద్యార్థులు తెలుగు విూడియంలో పరీక్ష రాయనున్నారు. అటు ఏపీలో నేటి నుంచి ఈనెల 18వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఏపీలో ఒక నిమిషం నిబంధనను అమలులోకి తీసుకువచ్చారు. ఏపీలో 6.64 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గతేడాది వరకూ ఏడు పేపర్ల విధానం అమల్లో ఉండగా, ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరుగుతున్నాయి.
