Warangalvoice

Lawyer Suffers Heart Attack While Pleading Case In Telangana High Court

తెలంగాణ‌ హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా న్యాయ‌వాదికి గుండెపోటు

  • తెలంగాణ హైకోర్టులో విషాదం నెల‌కొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా ఓ న్యాయ‌వాది గుండెపోటుకు గుర‌య్యాడు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టులో విషాదం నెల‌కొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా ఓ న్యాయ‌వాది గుండెపోటుకు గుర‌య్యాడు. కోర్టు హాలులోనే న్యాయ‌వాది కుప్ప‌కూలిపోయాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌డ్జి, ఇత‌ర న్యాయ‌వాదులు.. బాధిత న్యాయ‌వాదిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే న్యాయ‌వాది మృతి చెందిన‌ట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన న్యాయ‌వాదిని వేణుగోపాల‌రావుగా గుర్తించారు. సంతాపంగా 21వ కోర్టు హాలులో జ‌డ్జి విచార‌ణ‌ను నిలిపివేశారు. మిగిలిన కోర్టు హాళ్ల‌లోనూ రెగ్యుల‌ర్ పిటిష‌న్ల‌ను వాయిదా వేశారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. న్యాయ‌వాది వేణుగోపాల‌రావు మృతిప‌ట్ల హైకోర్టు జ‌డ్జిలు, న్యాయ‌వాదులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.

Lawyer Suffers Heart Attack While Pleading Case In Telangana High Court
Lawyer Suffers Heart Attack While Pleading Case In Telangana High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *